టీంను ప్ర‌క‌టించిన బీసీసీఐ

ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : వెస్టిండీస్ (West Indies)తో జ‌ర‌గ‌నున్న టెస్ట్ సిరీస్ (Test series)కు భారత జట్టును ప్ర‌క‌టించారు. అక్టోబర్ 2 నుంచి జరగనున్న జ‌ర‌గ‌నున్న ఈ సిరీస్‌కు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (BCCI chief selector Ajit Agarkar) జ‌ట్టును ఖ‌రారు చేశారు. ఆసియా కప్ (Asia Cup) టోర్నీ కోసం దుబాయ్ (Dubai) లో ఉన్న భారత టెస్టు జట్టు సారథి శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill), ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్ (coach Gautam Gambhir)తో అగార్కర్ తాజాగా భేటీ అయ్యారు.

టెస్టు జట్టు కూర్పుపై వారితో చర్చించాక జట్టును ప్రకటించారు. రెండు టెస్టుల ఈ సిరీస్ లో టీమిండియా శుభ్ మన్ గిల్ సారథ్యంలో విండీస్ తో తలపడనుంది. వైస్ కెప్టెన్ గా రవీంద్ర జడేజా (Ravindra Jadeja as vice-captain) ఎంపిక‌య్యాడు. రిషబ్ పంత్ స్థానంలో ఎన్‌.జగదీశన్‌ ను సెలెక్ట్ చేశారు. ఇంగ్లాండ్‌ పర్యటనలో రాణించని కరుణ్ నాయర్‌, శార్దూల్ ఠాకూర్‌ లను పక్కన పెట్టారు. కాగా, జస్‌ప్రీత్ బుమ్రా రెండు టెస్టులకూ అందుబాటులో ఉంటాడని అగార్కర్ పేర్కొన్నారు.

టీమిండియా జట్టు..
శుభ్‌మన్‌ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదుత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (బ్యాకప్ వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్, జగదీశన్ (వికెట్ కీపర్), సిరాజ్, ప్రసిద్ధ్‌ కృష్ణ, కుల్‌దీప్‌ యాదవ్.