bangladesh-measles-virus- children I 2905I బంగ్లాదేశ్లో మీజిల్స్ మహమ్మారి తీవ్రరూపం

ఆస్పత్రుల్లో పెరుగుతున్న చిన్నారుల సంఖ్య
టీకాల వ్యవస్థ క్షీణతతో ఆందోళన
60 వేలకుపైగా అనుమానిత కేసుల నమోదు
పిల్లల మృతులతో కలత చెందిన కుటుంబాలు
ప్రపంచవ్యాప్తంగా మీజిల్స్ ముప్పుపై హెచ్చరికలు

bangladesh-measles-virus- children I 2905 I ఆంధ్రప్రభ వెబ్, అంతర్జాతీయం : ప్రపంచంలో వైరస్లు, అంటు వ్యాధులు దాడులు చేస్తున్నాయి. 2024లో ప్రపంచ వ్యాప్తంగా లక్ష మందిని బలిగొన్న మీజిల్స్ వైరస్ ప్రస్తుతం బంగ్లాదేశ్లో పిల్లలపై దాడి చేస్తున్నది. కేవలంలో మూడు నెలలోనే 528 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ దేశంలోని దాదాపు అన్ని ఆస్పత్రులు పిల్లలతో నిండిపోయాయి. మరికొందరిని చేర్చుకునే పరిస్థితి లేదు. చిన్నారుల బాధలను చూసి తల్లులు తల్లడిల్లిపోతున్నారు.

ఇటీవల కాలంలో మీజిల్స్ (తట్టు) వైరస్ వ్యాప్తికి ఒక్క బంగ్లాదేశ్లో 528 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. 2024లో ప్రపంచ వ్యాప్తంగా లక్ష మంది పిల్లలు మృతి చెందారు. బంగ్లాదేశ్లో 2024 నుంచి రాజకీయ అశాంతి తరువాత రోగనిరోధక టీకాలు వేయడంలో ఆ దేశ ప్రభుత్వం అలసత్వం వహించింది. ఆ దేశం అలసత్వం కారణంగా ఈ ఏడాది మార్చి 15 నుండి ఇప్పటి వరకూ ఐదు వందల మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. బంగ్లాదేశ్ వ్యాప్తంగా 60,000 మందికి పైగా అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇది అత్యంత ప్రమాదకర వైరస్. దగ్గు, తుమ్ము ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది.ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని పలు దేశాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికాలు జారీ అవుతున్నాయి.

bangladesh-measles-virus- children I 2905 I రోజురోజుకూ పెరిగిపోతున్నవ్యాధి సోకిన పిల్లలు
బంగ్లాదేశ్లో మీజిల్స్ వ్యాధి రోజురోజుకు విజృంభిస్తున్నది. ఈ వ్యాధిపై తాము మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నామని, ఇది నిశ్శబ్దంగా విస్తరిస్తున్నదని ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ ఏషియా డీడీ హసినా రహ్మాన్ తెలిపారు. ఢాకా ఆసుపత్రులు చిన్నారులతో నిండిపోయాయి. తీవ్రమైన కేసుల కోసం ఉన్న సౌకర్యాలు కూడా సరిపోవడం లేదు. అనేక పిల్లలు చికిత్స కోసం వచ్చినా వెనుక్కు పంపివేస్తున్నారు.
bangladesh-measles-virus- children I 2905 I ఇవీ లక్షణాలు…
మీజిల్స్ వ్యాధి వచ్చిన వెంటనే పిల్లలు పూర్తిగా బలహీనమై తినడం మానేస్తారు. చిరునవ్వు కూడా లేకుండా మారింది. నిమోనియా, మెదడు వాపు, చూపు కోల్పోవడం అనంతరం ప్రాణాలు కోల్పోతారు. ఈ వ్యాధి ఎక్కువగా ఐదేళ్ల లోపు పిల్లల్లో వ్యాప్తి చెందుతోంది.
bangladesh-measles-virus- children I 2905 I టీకా వ్యవస్థ క్షీణత
బాంగ్లాదేశ్ గతంలో టీకా కార్యక్రమంలో విజయవంతమైన దేశంగా గుర్తింపు పొందింది. 2019లో వేక్సిన్ హీరో అవార్డు కూడా అందుకుంది. అలాంటి బంగ్లాదేశ్లో 2024లో వచ్చిన రాజకీయ సంక్షోభంతో టీకా వ్యవస్థలో మార్పులు వచ్చాయి. ప్రధానంగా టీకా వ్యవస్థ క్షీణించింది. పిల్లలకు టీకాలు వేయకపోవడమే పెద్ద సమస్యగా మారింది. ఇదే మీజల్స్ వ్యాప్తికి ప్రధాన కారణమైంది. బంగ్లాదేశ్లో మీజిల్స్ వ్యాధి విజృంభణతో పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహాయంతో 64 జిల్లాల్లో లక్షలాది మంది పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభించారు.
