She Team | షీ టీమ్ నిర్వహణ పై విద్యార్థులకు అవగాహన…

She Team | షీ టీమ్ నిర్వహణ పై విద్యార్థులకు అవగాహన…

She Team | చెన్నూర్, ఆంధ్రప్రభ : రామగుండం పోలీస్ కమిషనర్ కిషోర్ ఝా(Police Commissioner Kishore Jha) ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో జిల్లా షీ టీమ్(She Team) ఇంచార్జి హైమ ఆధ్వర్యంలో ఈ రోజు చెన్నూర్ మండలం కిష్టంపేట జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థినిల(school girls)కు షీ టీమ్ పనిచేసే విధానం పై అవాహన కల్పించారు.

ఈ సందర్బంగా ఇంచార్జీ హైమ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమకు ఏదైన ఆపద ఎదురైనప్పుడు షీ టీమ్ సహాయం పొందడానికి ఎప్పుడు అందుబాటులో ఉండే 100 లేదా రామగుండం షీ టీమ్ వాట్సప్ 6303923700, 8712659385 నంబర్లకు కాల్ చేసి సహాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమం లో షీ టీమ్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినీలు పాల్గొన్నారు.

Leave a Reply