Temple | అయ్యప్ప వార్షికోత్సవ వేడుకలు…

Temple | అయ్యప్ప వార్షికోత్సవ వేడుకలు…

అయ్యప్ప ఆలయ వార్షిక సన్నాహక సమస్యలు మాట్లాడుతున్న అశోక్ గౌడ్ గురుస్వామి

Temple | మక్తల్, ఆంధ్రప్రభ : శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ వార్షిక ఉత్సవాలను విజయవంతం చేయాలని గురుస్వామి అశోక్ గౌడ్ (Guruswami Ashok Goud) పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో శ్రీ హరిహర పుత్ర శ్రీ అయ్యప్ప ఆలయ నిర్మాణం పది సంవత్సరాల పూర్తయిన సందర్భంగా దశమ వార్షికోత్సవ వేడుకలను డిసెంబర్ 2 ,3 4వ తేదీలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఆలయంలో వార్షికోత్సవ సన్నాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ గురు స్వామి మాట్లాడుతూ వార్షిక ఉత్సవాలలో భాగంగా డిసెంబర్ 2న అభిషేకాలు, డిసెంబర్ 3న హోమం , డిసెంబర్ 4న కన్యస్వాములచే 18 మెట్ల పూజ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మూడు రోజులపాటు జరిగే వార్షికోత్సవాలను అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అశోక్ గౌడ్ స్వామి కోరారు.ఈ కార్యక్రమంలో గురుస్వాములు తాళంపల్లి అనిల్, పవన్ గౌడ్, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply