Donation| హరే కృష్ణ హెరిటేజ్ టవర్‌ కు రూ.2 కోట్లు విరాళం

Donation| హైదరాబాద్, ఆంధ్రప్రభ : హరేకృష్ణ మూవ్‌మెంట్, హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతిష్ఠాత్మక హరేకృష్ణ హెరిటేజ్ టవర్ ప్రాజెక్ట్‌కు అరబిందో ఫార్మా లిమిటెడ్ దాతృత్వ సంస్థ అరబిందో ఫార్మా ఫౌండేషన్ (Aurobindo Pharma Foundation) నుంచి కీలకమైన ఆర్థిక సహాయం లభించింది. ఈ మేరకు భారతీయ సంస్కృతి, కళలు, వారసత్వాన్ని ప్రోత్సహించే గరుడ భవన్ నిర్మాణం కోసం రూ. 2 కోట్లను విరాళంగా అందజేశారు. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన సాంస్కృతిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ హెరిటేజ్ టవర్‌కు వివిధ కార్పోరేట్ కంపెనీలు, వ్యక్తులు విశేషమైన మద్దతు అందిస్తున్నారు. ఈ సందర్భంగా అరబిందో ఫార్మా లిమిటెడ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ కె. నిత్యానంద రెడ్డి చెక్కును హరే కృష్ణ హెరిటేజ్ టవర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కౌంతేయ దాస ప్రభూజీకి అందజేశారు.

నిత్యానంద రెడ్డి, శరత్ చంద్రా రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సాంస్కృతిక విలువలను పరిరక్షించేందుకు.. సమగ్ర సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఇది అరబిందో ఫార్మా వైఖరిని ప్రతిబింబించే విరాళం అని వారు తెలిపారు. హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మాణం భారతీయ కళా సంపదను, ఆధ్యాత్మికతను, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే మహోన్నత ప్రయత్నమని అభినందించారు. ఇలాంటి సాంస్కృతిక, సామాజిక ప్రయోజనకర కార్యక్రమాలకు సంస్థ ఎల్లప్పుడూ తోడ్పాటును అందిస్తుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా హరేకృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ ప్రెసిడెంట్ శ్రీమాన్ సత్య గౌరచంద్ర దాస ప్రభూజీ (M.Tech – IIT Madras) అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఔదార్యతనంతో కూడిన ఆర్థిక సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో సంస్థలు, సమాజసేవా సంస్థలు కలిసి పనిచేయడం ద్వారా భారతీయ వారసత్వ పరంపరను భవిష్యత్ తరాలకు అందించడం మరింత సులభమవుతుందని పేర్కొన్నారు.

అరబిందో ఫార్మా ఫౌండేషన్ గురించి..
అరబిందో ఫార్మా లిమిటెడ్‌ దాతృత్వ సంస్థ అరబిందో ఫార్మా ఫౌండేషన్, దేశ అభివృద్ధి కోసం వివిధ రంగాల్లో ప్రభావవంతమైన (సీఎస్ఆర్) CSR కార్యక్రమాలను అమలు చేస్తోంది. నిపుణుల బృందాల ద్వారా ప్రాజెక్టులను నేరుగా నిర్వహించడమే కాకుండా, కమ్యూనిటీ సంస్థలతో కలిసి ప్రజాప్రయోజన కార్యక్రమాలను సైతం అమలు చేస్తోంది.

ప్రధాన సేవా రంగాలు:

  1. విద్య
  2. ఆరోగ్య సంరక్షణ & పారిశుద్ధ్యం
  3. పోషకాహారం
  4. నైపుణ్యాభివృద్ధి
  5. కళ, సంస్కృతి & వారసత్వ పరిరక్షణ

మరిన్ని వివరాలకు : www.aurobindo.com/sustainability/aurobindo-foundation/
ధన్యవాదాలు & శుభాకాంక్షలు,
PRO – పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
హరే కృష్ణ మూవ్‌మెంట్ – హైదరాబాద్
సంప్రదించండి: 96400 86664 / 93964 16341