ఓటు చోరీపై చైతన్యం
ఓటు చోరీపై చైతన్యం
నారాయణ పేట, ఆంధ్ర ప్రభ : దేశంలో పలు ప్రాంతాల్లో ఓటు చోరీ జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణిక రెడ్డి ( Chittam Parnika Reddy) అన్నారు. ఓట్లు చోరీపై ప్రజలను చైతన్యవంతులు చేస్తామన్నారు. ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మొదటిగా స్థానిక ఎమ్మెల్యే (MLA) సంతకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేశంలోని పలుప్రాంతాల్లో ఓటు చోరీ జరుగుతుందని, దాన్ని వ్యతిరేకించే హక్కు ప్రజలకు ఉందన్నారు. ప్రతి గ్రామంలో వంద మందికి పైగా సంతకాల సేకరణ చేయించాలని పిలుపునిచ్చారు.
