Awareness | డ్రైవింగ్ లైసెన్స్ లు లేకుండా..

Awareness | డ్రైవింగ్ లైసెన్స్ లు లేకుండా..

  • ఇన్స్పెక్టర్ మన్మధకుమార్

Awareness | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : లైసెన్సులు లేకుండా ఎవరు కూడా వాహనాలను నడపవద్దని, వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సేఫ్టీ రూల్స్ పాటించాలని చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి మన్మధ కుమార్ తెలిపారు. రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎర్రివ్ అలీవ్ కాంపెయిన్ 2025-2026 ప్రోగ్రామ్ లో భాగంగా చౌటుప్పల్ పట్టణంలోని ట్రినిటీ స్కూల్ లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ మాట్లాడుతూ… డ్రైవింగ్ లైసెన్స్, రోడ్ సేఫ్టీ, హెల్మెట్, సీట్ బెల్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్ ల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటిస్తామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చౌటుప్పల్ మండల అధ్యక్షురాలు వెన్ రెడ్డి సంధ్యా రాజు, ఎస్సైలు అజయ్ భార్గవ్, ఏఎంవిఐ లు హర్షవర్ధన్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి, పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్ ఉజ్జిని మంజుల, పాఠశాల చైర్మన్ కృష్ణారావు, ఉపాధ్యాయులు, 500 మందికి పైగా విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply