Avanigadda | ఉచిత మెగా వైద్య శిబిరం..

Avanigadda | ఉచిత మెగా వైద్య శిబిరం..

Avanigadda, అవనిగడ్డ, ఆంధ్రప్రభ : దివిసీమకు (Diviseema) చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బొండాడ రాఘవేంద్రరావు 51వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన స్వగ్రామమైన నాగాయలంక మండలం పర్రచివరలో ఈనెల 28వ తేదీన ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు బొండాడ ఫౌండేషన్ ప్రతినిధి వంగర శేషగిరిరావు తెలిపారు. అవనిగడ్డ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉచిత మెగా వైద్య శిబిరం కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ.. బొండాడ గ్రూప్ సి.ఎం.డి రాఘవేంద్రరావు జన్మదినాన్ని పురస్కరించుకుని బొండాడ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీలిమ ఆధ్వర్యంలో తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ సౌజన్యంతో ఈ నెల 28వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ నిర్వహించే ఈ వైద్య శిబిరంలో గుండె, మూత్రపిండాలు, నరాలు, ఎముకలు, చిన్న పిల్లలకు సంబంధించిన సమస్యలకు ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించడంతో పాటు మహిళలకు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేయనున్నట్టు చెప్పారు.

ఈ అవకాశాన్ని పర్రచివర పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా శేషగిరావు కోరారు. ఈ సమావేశంలో బొండాడ ప్రతినిధి భానుచంద్, ప్రెస్ క్లబ్ కార్యదర్శి పుట్టి శ్రీనివాసరావు, ప్రింట్ అండ్ మీడియా జర్నలిస్టులు అలపర్తి గోపాలకృష్ణ, నాగినేని మునీశ్వరరావు, కంచర్లపల్లి వెంకట నాంచారయ్య పాల్గొన్నారు.

Leave a Reply