Attack-Attempt : పోలవరం ఎమ్మెల్యేకి షాక్​ Andhra Prabha Top News

Attack-Attempt : పోలవరం ఎమ్మెల్యేకి షాక్​ Andhra Prabha Top News

  • పార్టీ ఆఫీసులోనే దాడి కి యత్నం
  • జనసేనలో కలకలం
  • ఇది పెత్తందారుల కుట్ర
  • ఇక సహించేది లేదు
  • ఎమ్మెల్యే బాలరాజు ఆగ్రహం

( ఏలూరు, ఆంధ్రప్రభ)

Attack-Attempt : జనసేన పార్టీ కార్యాలయంలొనే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడి యత్నం కలకలం రేపింది. ఏలూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. శుక్రవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పార్టీ నిర్మాణ సారథుల ఎంపిక కోసం ఏలూరులోని జనసేన జిల్లా కార్యాలయానికి వచ్చారు. దరఖాస్తు ప్రక్రియ ముగించుకొని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతుండగా, అదే పార్టీకి చెందిన ఏలూరు నాయకుడు బొత్స మధు ఆయనపై దూసుకొచ్చారు.
బొత్స మధు దూకుడుగా రావడాన్ని గమనించిన పీఎస్‌ఓలు, అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు వెంటనే స్పందించారు. ఎమ్మెల్యేకు, బొత్స మధుకు మధ్య అడ్డుగా నిలిచి అతడిని పక్కకు లాక్కెళ్లారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. లేకపోతే ఏం జరిగేదోనని అక్కడున్న కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన అనంతరం తీవ్ర ఆవేదనతో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బాలరాజు, పోలవరం రాజకీయాలపై బాంబు పేల్చారు. పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలరాజు వర్గం, మరో సీనియర్ నేత వర్గం మధ్య కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల విషయంలో ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేటి దాడి యత్నం ఆ వర్గపోరులో భాగమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Attack-Attempt : ఇది పెత్తందారుల కుట్ర

నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి పార్టీలో కొందరు పెత్తందారులు నన్ను పని చేయనివ్వడం లేదు. నాపై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. నా ఎదుగుదలను ఓర్వలేకే ఈ కుట్రలు” అని ఎమ్మెల్యే బాలరాజు ఆరోపించారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న తాను ఇక సహించేది లేదని స్పష్టం చేశారు.