బొల్లారంలో దారుణం…

బొల్లారంలో దారుణం…

  • సంత నుంచి తిరిగి వస్తుండగా దంపతులపై దాడి
  • మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన గుర్తుతెలియని వ్యక్తులు
  • అడ్డుకున్న భర్తపై దాడి చేసి గాయపరిచిన దుండగులు
  • కత్తితో మహిళ గొంతు కోసి పరారైన దుండగులు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఐడీఏ బొల్లారం పోలీసులు
  • నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం
  • స్థానికంగా కలకలం రేపిన ఘటన

బొల్లారం, ఆంధ్రప్రభ : బొల్లారం ప్రాంతంలో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. వెంకటేశ్వర కాలనీకి చెందిన అనిల్ కుమార్, మీనా దంపతులు సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి వారిని అడ్డగించినట్లు సమాచారం. దుండగులు మీనాతో అసభ్యంగా ప్రవర్తించగా, భర్త అనిల్ కుమార్ అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన దుండగులు అతనిపై దాడి చేసి గాయపరిచినట్లు తెలిసింది.

అనంతరం మహిళ మీనా గొంతును కత్తితో కోసి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.గాయపడిన భర్తను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఐడీఏ బొల్లారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply