Assembly | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

Assembly | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
Assembly | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే కాసేపటి క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. మూసీపై ప్రభుత్వ సమాధానం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు శాసనసభ ప్రాంగణం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల సమస్యలపై నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వినూత్న రీతిలో మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి చేరుకున్నారు.

అయితే, అసెంబ్లీ గేటు వద్దే మార్షల్స్ వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న రైతు భరోసాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేతుల్లో మొక్కజొన్న కంకులు పట్టుకుని సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, సభ లోపలికి ఇటువంటి వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతి లేదని మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. ఆ తర్వాత సభలో మూసీపై ప్రభుత్వం సమాధానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
