ఇన్స్పెక్టర్లు,ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని
7 ఫ్రీ ప్రైమరీ పాఠశాలల్లో పూర్వ ప్రాధమిక తరగతులు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని జైనుర్ మండల విద్యాశాఖ అధికారి మధుకర్ జాదవ్ తెలిపారు. ఈ సందర్బంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ ఇన్స్టక్టర్, ఆయా పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థులు జూన్ 9 సాయంత్రం 4 లోపు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తుల సమర్పించాలని ఆయన కోరారు.
మహిళ దరఖాస్తుదారుల వయోపరిమితి 18-44 అని, ఎస్సి, ఎస్టీ మహిళలకు ఐదు సంవత్సరాలు, సడలింపు,దివ్యంగా మహిళలకు 10 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుందని తెలిపారు. విద్యార్హత ఇన్స్టాక్టర్ దరఖాస్తు చేసుకునేవారు ఇంటర్ ఆయా కొరకు ఏడవ తరగతి ఉత్తిర్ణులై ఉండాలన్నారు. మండలంలోని ప్రభుత్వ డిఎన్టి యూపిఎస్ శివునూర్ , ఎంపీపీస్ రాంనాయక్ తాండా, ఎంపీపీస్ జంగావ్ ఎంపీపీస్ భూసిమెట్ట, ఎంపీపీస్ జైనూర్ ఎంపీపీస్ గోండ్ గూడగౌరి,ఎంపీపీస్ వడ్డరు గూడ (ఎ )లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తులు స్వీకరించబడతాయని మండల విద్యాశాఖ అధికారి మధుకర్ జాదవ్ తెలిపారు.
