పాపం పసిప్రాణాలు..
పాపం పసిప్రాణాలు..
ప్రాణాంతకకరమైన రోగాలతో పోరాటాలు..
వైద్యం కోసం ఎదురు చూపులు.
పాయకాపురం, ఆంధ్ర ప్రభ : పగోడికి కూడా ఇలాంటి రోగం రాకూడదని ప్రతి సాధారణ మనిషి అనుకొనేమాట.ఐతే పసి పిల్లలకు ఇటువంటి అసాధారణ రోగం వస్తే ఆ తల్లిదండ్రులు పరిస్థితి అంతాఇంతా కాదు. వారి హృదయాలు తల్లడిల్లుతాయి. నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఇటువంటి హృదయాన్ని పిండేసే సంఘటనలు ఆంధ్రప్రభ న్యూస్ మీ ముందుకు తెచ్చింది.కొడుకు అసాధారణ రోగంతో ఉంటే ఓ తండ్రి పడే ఆవేదన..

నా పేరు ముని ఆనంద్,మాది విజయవాడ కొత్త రాజ రాజేశ్వరి పేట. మా బాబు ముని రిషికుమార్ వయస్సు 4 సంవత్సరాలు 7 నెలలు. మా బాబు ఎస్. ఎమ్. ఏ వ్యాధి(స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ) తో బాధపడుతున్నాడు…మా బాబు పుట్టి 1సంవత్సరం 5 నెలలు అవుతున్నా సరే నడవడం లేదు అని మంగళగిరిలోని ఎయిమ్స్ హోస్పాటిల్లో చేర్చాము.వైద్యులు 10 రోజులు పరీక్షలు చేసినప్పటికీ కానీ సమస్య ఏంటో తెలియలేదు.ఇంకా ఆఖరిగా జెనిటిక్ టెస్ట్ చెయ్యాలని వైద్యులు తెలిపారు.అందులో ఎస్. ఎమ్. ఏ అనే టైప్ వన్ ఉందని ధ్రువీకరించి మాకు తెలిపారు.అక్కడ వైద్యులతో నేను మాట్లాడాను.సదరు రోగానికి సంబంధించిన వైద్యం నిమిత్తం సుమారు 16 నుండి 18కోట్లు ఇంజెక్షన్ అవుతుంది అని చెప్పారు. ఈ ఇంజక్షన్ కూడా 5 సంవత్సరాలు లోపే చేపించాలని అన్నారు .

మాది ఒక మధ్యతరగతి కుటుంబం.ఒక్కసారిగా 16కోట్లు అంటే మాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.మేము కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి వారిని డోనేషన్ అడగటం జరిగింది.కానీ అంత పెద్ద అమౌంట్ అనే సరికి వారుకుడా ఏమి చేయగలరు.అప్పటినుంచి ఇప్పటి వరకు బాబు బెడ్ మీదే వుంటూ ఎలాంటి ట్రీట్మెంట్ కూడా చేపించలేక పోయాము.బాబుకి ఫుడ్ కూడా ద్రవ రూపంలో ఇవ్వాలి.ఇన్ని సంవత్సరాలు అవుతున్న మాకు ఎం చెయ్యాలో తెలియక రీసెంట్ గా పునర్విక అనే పాపకి కూడా ఇలానే రోగం ఉంటే, ఆ పాపకి అందరు సపోర్ట్ చేసి బ్రతికించారు. అప్పుడు మాకు కూడా ఆ పాపనిను చూసినాకా మాకు ఒక దైర్యం వచ్చింది.బాబు యొక్క పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి బాబుని కాపాడతారని ప్రాధేయపడుతున్నాం.
సింగ్ నగర్ వడ్డెర కులానికి చెందిన భవాని తన బిడ్డ గురించి చెప్తూ భార్యాభర్తలిద్దరం మట్టిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము.మాకు ఇద్దరు సంతానం.బాబు నిఖిల్ సిద్దార్ధ (3)పాప(2)సంవత్సరాలు.ఏరోగం దాపురించిందో తెలియదుగాని,తోటి పిల్లల మాదిరిగా ఆడుకోవడం లేదు.కాళ్ళు చేతులు, కళ్ళు వాపులు వస్తున్నాయి.వెంటనే వైద్యులు వద్దకు బాబును తీసుకొని వెళ్ళాం.పరీక్షలు నిర్వహించిన పిదప కిడ్నీ సంబందిత రోగంతో బాధపడుతున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు.ప్రస్తుతం ఆసుపత్రిలో బాబు వైద్యం పొందుతున్నాడు.దాతలు స్పందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

