Politics | ఏపీ పాలిటిక్స్‌లో కొత్త ‘పదం’.. పాత యుద్ధం!

Politics | ఏపీ పాలిటిక్స్‌లో కొత్త ‘పదం’.. పాత యుద్ధం!
Politics | అసలేమిటీ ‘మావిగాన్’ గోల?
టీడీపీ సెటైర్లు.. మీమ్స్ కుంభవృష్టి
వైసీపీ రివర్స్ గేర్.. రియల్ ఎస్టేట్ కౌంటర్లు
విశ్లేషకుల మర్మం.. కామెడీనా? పొలిటికల్ నినాదమా?
Politics | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు.. ‘మావిగాన్’. వినడానికి ఏదో హాలీవుడ్ సినిమాలో గన్ పేరులా ఉన్నా, ఇది మన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి మైండ్ నుంచి పుట్టిన సరికొత్త పొలిటికల్ కాన్సెప్ట్. అమరావతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, నిధుల వర్షం కురిపిస్తున్న తరుణంలో.. అటు నుంచి అమరావతి ‘స్పీడ్’ వస్తుంటే, ఇటు నుంచి జగన్ ఈ ‘మావిగాన్’ అనే బాణాన్ని వదిలారు. ఇక సోషల్ మీడియాలో మొదలైంది చూడండి.. ఒక రేంజ్ పొలిటికల్ కురుక్షేత్రం!
Politics | అసలేమిటీ ‘మావిగాన్’ గోల?
మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గాన్ అంటే గుంటూరు. ఈ మూడు అక్షరాలను కలిపి ఒక భారీ క్లస్టర్‌గా మార్చి, 2029 కల్లా అద్భుతాలు చేస్తామనేది వైసీపీ నినాదం. అమరావతికి పోటీగా ‘మావిగాన్ 2029’ అంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ గ్రాఫిక్స్ తో అదరగొడుతుంటే.. టీడీపీ తమ్ముళ్లు మాత్రం “ఇదెక్కడి వింత పేరు సామీ!” అంటూ మీమ్స్ తో విరుచుకుపడుతున్నారు.
Politics | టీడీపీ సెటైర్లు.. మీమ్స్ కుంభవృష్టి
టీడీపీకి దొరికిందే ఛాన్స్! “గతంలో అమరావతిని గ్రాఫిక్స్ అన్న నోళ్లే, ఇప్పుడు మావిగాన్ అంటూ మాయాజాలం చూపిస్తున్నాయి” అంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు. “మొదట అమరావతికి జై కొట్టారు, తర్వాత మూడు రాజధానులు అని మూడు ముక్కలాట ఆడారు, ఇప్పుడు కొత్తగా ఈ మావిగాన్ ఏంటి?” అని లోకేష్ వంటి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. పేరు వినడానికే ఒక విదేశీ తుపాకీలా ఉందని, ప్రజల దృష్టి మరల్చడానికే ఈ ‘పద’ ప్రయోగాలు అని పసుపు దళం ట్రోల్ చేస్తోంది.
Politics | వైసీపీ రివర్స్ గేర్.. రియల్ ఎస్టేట్ కౌంటర్లు
కౌంటర్లు ఇవ్వడంలో వైసీపీ శ్రేణులు కూడా తగ్గేదేలే అంటున్నారు. “కేవలం కొన్ని గ్రామాల కోసమే లక్షల కోట్లు కుమ్మరించడం కంటే, మూడు ప్రధాన నగరాలను కలిపి అభివృద్ధి చేస్తే తప్పేంటి?” అని నిలదీస్తున్నారు. అమరావతి కేవలం ఒక సామాజిక వర్గం ప్రయోజనాల కోసం, టీడీపీ నేతల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనని.. మావిగాన్ మాత్రం అందరి కోసమని వారు వాదిస్తున్నారు. “మావిగాన్ అంటే ప్రజల ప్లాన్.. అమరావతి అంటే బాబు గారి ప్లాన్” అంటూ కౌంటర్ పోస్టులతో హోరెత్తిస్తున్నారు.
Politics | విశ్లేషకుల ‘మర్మం’.. కామెడీ మెటీరియలా? పొలిటికల్ నినాదమా?
రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. అమరావతికి వస్తున్న హైప్ ని తగ్గించడానికి జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. అయితే సొంత పార్టీలోనే సజ్జల వంటి నేతలు “పేరు ఏదైనా ప్రయోజనం ముఖ్యం” అని కవర్ చేస్తున్నారంటే, ఈ పేరుపై వారిలోనే కొంత సందిగ్ధత ఉందన్నది స్పష్టం. మొత్తానికి ‘మావిగాన్’ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక పక్క నవ్వులు పూయిస్తూనే, మరోపక్క 2029 ఎన్నికల వరకు ఒక సీరియస్ పొలిటికల్ నినాదంగా మారేలా కనిపిస్తోంది. చూద్దాం.. ఈ ‘గన్’ ఎవరిని పేలుస్తుందో!
