RIP | డిప్యూటీ సిఎం భ‌ట్టి పిఎ శ్రీనివాస్ గుండెపోటుతో మృతి

హైద‌రాబాద్ -డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాస్ గుండెపోటుతో కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. విధుల‌లో ఉండ‌గా ఆయ‌న‌కు గుండె పోటు రాగా ఆయ‌న‌ను వెంట‌నే హాస్సిట‌ల్ కు త‌ర‌లించారు. అయితే ఆయ‌న అప్ప‌టికే మ‌ర‌ణించారు.. కాగా, ఐసీడీఎస్ లో సూపరింటెండెంట్ గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు శ్రీనివాస్.. ఇక గత ఆరు సంవత్సరాలుగా భట్టి విక్రమార్క కు పీఏగా పనిచేస్తున్నారు. ఆయ‌న మృతి ప‌ట్ల భ‌ట్టి దిగ్ర్బాంతి వ్య‌క్తం చేశారు.. మృతికి సంతాపం ప్ర‌క‌టించారు.. ఆయ‌న కుటుంబాన్ని అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని చెప్పారు.

Leave a Reply