లైంగిక వేధింపులపై ఉక్కుపాదం

లైంగిక వేధింపులపై ఉక్కుపాదం

మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్ స‌స్పెన్ష‌న్‌
ప్రిన్సిపల్, మ‌రో ప్రొఫెస‌ర్ ను ప్ర‌భుత్వానికి స‌రెండ‌ర్‌
ఆయుష్ ఇoఛార్జ్ క‌మీష‌న‌ర్ రోణంకి గోపాల‌కృష్ణ వెల్ల‌డి

విజ‌య‌వాడ‌, ఆంధ్రప్రభ: విజ‌య‌వాడ‌లోని డాక్ట‌ర్ నోరి రామ‌శాస్త్రి ప్ర‌భుత్వ ఆయుర్వేద వైద్య క‌ళాశాల‌లో లైంగిక వేధింపుల సంఘ‌ట‌న‌కు సంబంధించి వైద్యారోగ్య శాఖ చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. డాక్ట‌ర్ డి.మౌళి నాయ‌క్‌ (మెడిక‌ల్ ఆఫీస‌ర్‌-అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌), ల్యాబ్ టెక్నీషియ‌న్ కె.వి.సుబ్ర‌హ్మ‌ణ్యంల‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు ఆయుష్ ఇన్‌ఛార్జ్ క‌మీష‌న‌ర్ రోణంకి గోపాలకృష్ణ నేడొక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అలాగే విధుల నిర్వహణలో బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ కె.నిర్మ‌లాజ్యోతీబాయి, ప్రొఫెస‌ర్ కె.విజ‌య‌కుమారి(పియ‌స్‌పి విభాగం)ల‌ను ప్ర‌భుత్వానికి స‌రెండ‌ర్ చేశామ‌ని ఆయ‌న తెలిపారు.

లైంగిక వేధింపుల‌కు సంబంధించి క‌ళాశాల‌లో అంత‌ర్గతంగా విచార‌ణ జ‌రుగుతోందని ఆయ‌న వెల్ల‌డించారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి.ల‌క్ష్మీశా కు రాసిన లేఖలో స్వ‌తంత్ర క‌మిటీ ద్వారా విచార‌ణ జరిపించాలని కమిషనర్ కోరారు. ఆయుర్వేద క‌ళాశాలలో లైంగిక వేధింపుల‌కు సంబంధించి రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్, ప్రభుత్వానికి మెయిళ్ల ద్వారా ఫిర్యాదులు అoదాయి. విచారణల అనంతరం చర్యలు మొదలయాయి.