AP | నగరపాలక సంస్థల్లో సోదాలు

AP | నగరపాలక సంస్థల్లో సోదాలు
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏసీబీ (అంటీ-కరప్షన్ బ్యూరో) మరోసారి అక్రమాలపై తనిఖీలు చేపట్టేందుకు బయలుదేరింది. రాష్ట్రంలోని గుంటూరు, శ్రీకాకుళం, ఒంగోలు, విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లోని నగరపాలక సంస్థల్లోని టౌన్ ప్లానింగ్ కార్యాలయాలపై ఆకస్మిక సోదాలు, తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి.

టౌన్ ప్లానింగ్ విభాగ అధికారులు చేపట్టిన పనులు, అనుమతులు, భవన నిర్మాణాలు, లైసెన్సులు వంటి కీలక కార్యక్రమాలపై ఎక్కువ ఫిర్యాదులు, అక్రమాలు, అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ ఈ దాడులు చేపట్టింది. ఈ తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా అధికారుల మధ్య భయాందోళనలు, అప్రమత్తతను రేపుతున్నాయి.
