చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా
- అసాంఘిక శక్తులకు పోలీస్ అంటే భయం ఉండాలి
- పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా
- బాధ్యతలు స్వీకరించిన ముగ్గురు ఏసీపిలు
గోదావరిఖని, ఆంధ్రప్రభ : చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదని… రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అక్రమ వ్యవహారాలు జరగకుండా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ అధికారులు నిరంతరం అలర్ట్ గా ఉండాలన్నారు.
శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్‌లోని వివిధ విభాగాల్లో నూతనంగా సీసీఎస్ విభాగంలో ఏసీపీలుగా కె. రవీందర్,టి.ప్రవీణ్ కుమార్,టాస్క్ ఫోర్స్ ఏసీపీ గా బి.శ్రీనివాస్ బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్‌ను ఏసీపి లు మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ ను కలిసి మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ మాట్లాడుతూ నూతనంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించిన అధికారులకు దిశ నిర్దేశం చేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారికి పోలీసులు అంటే భయం కలిగేలా పోలీస్ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. నేరాల నియంత్రణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన,నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు.
