అనంత అరణ్యానికి శ్రీకారం..

అనంత అరణ్యానికి శ్రీకారం..

గురుకులంలో 915 మొక్కల పెంపకం ప్రారంభం

మోపిదేవి, ఆంధ్రప్రభ: ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని కాపాడుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మోపిదేవిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘అనంత అరణ్య’ మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

రూ.3.30 లక్షల వ్యయంతో 15 సెంట్ల స్థలంలో 915 ఔషధ, పండ్ల, నీడనిచ్చే మొక్కలను నాటే కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలను ఆరోగ్యవంతమైన, పచ్చని విద్యా ప్రాంగణాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, ఇంచార్జి ఎంపీపీ నడకుదుటి జననీకుమారి, టీడీపీ మండల అధ్యక్షుడు నడకుదుటి జనార్ధనరావు, ఎంపీడీఓ జే. స్వర్ణభారతి, ఏఎస్‌డబ్ల్యూఓ పర్వీన్ సుల్తానా, ఎంఈఓలు శివశంకర్, జీఎన్‌బీ గోపాల్, ప్రిన్సిపాల్ వీరరవి, ఏపీఓ టీవీఎన్ ముత్యాలు, ఉపాధ్యాయులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply