చంద్రబాబు రెండు సంవత్సరాలు కాలం..
చంద్రబాబు రెండు సంవత్సరాలు కాలం..
ప్రజలకు వెన్నుపోటు..
పాయకాపురం, ఆంధ్రప్రభ : రెండు సంవత్సరాలు కాలంలో సీఎం చంద్రబాబు మోసం గ్యారంటీ అనే మాటను వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చెప్పారని వైసీపీ సెంట్రల్ కో ఆర్డినేటర్ మల్లాది విష్ణు అన్నారు. సింగ్ నగర్ ఆంధ్ర ప్రభాకాలనీ ప్రాంతంలో జనహిత సదనం కార్యాలయంలో గురువారం సీఎం చంద్రబాబు రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అందుకు నిరసనగా పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గ పరిధిలో పైపులరోడ్డు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం వెన్నుపోటుకు రెండు సంవత్సరాలు అనే పోస్టర్‌ను మల్లాది విష్ణు వైసీపీ శ్రేణులతో కలసి ఆవిష్కరించారు.
సూపర్ 6 ఫెయిల్, బడ్జెట్ కేటాయింపులు లేవు, అప్పుల రాష్ట్రం, సంక్షేమం లేదు,ప్రభుత్వ హాస్పిటల్‌ను పట్టించుకొనే నాధుడు లేడు,ఆరోగ్యశ్రీ నిర్వీర్యం, డీఎస్సీ తొలి సంతకంలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. స్పోర్స్ కోటాలో అవతకలు జరిగాయని వైసీపీ యువజన, విద్యార్థి విభాగాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని అన్నారు. వైసీపీ అంటే గొడ్డలి పార్టీ కాదని గత పాలనలో ఇంటికీ వెళ్లి సంక్షేమం బ్రోచర్ ఇచ్చామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజ, గౌస్ మొయిద్దీన్, క్లస్టర్ ఇంచార్జి పసుపులేటి ఏసు, మేడేపల్లి ఘాన్సీ రాణి,అలంపూరు విజయ్,ఎమ్. డి హఫీజ్, మాజీ కార్పొరేటర్లు,వైసీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
