Pawan kalyan | నగరవనం పార్క్ ప్రారంభం..

Pawan kalyan | నగరవనం పార్క్ ప్రారంభం..
pawan kalyan, అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : కళ్యాణదుర్గం ప్రాంతంలోని ప్రజలకు అందుబాటులో అటవీశాఖ ఆధ్వర్యంలో నగరవనం పార్కును అభివృద్ధి చేశారని ఈ పార్కును త్వరలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభం కానుందని ఎమ్మెల్యే అమిలినేని తెలియచేశారు. అది వర్చువల్ గా ప్రారంభిస్తారా లేక ఇక్కడికి నేరుగా వచ్చి ప్రారంభిస్తారా అనేది నిర్ణయించాల్సి ఉందన్నారు.
పట్టణంలోని నగరవనంను అటవీ శాఖ అధికారులు, ఆర్డీఓ, మున్సిపల్ కమీషనర్, స్థానిక టీడీపీ (TDP) నాయకులతో కలసి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఉదయాన్ని సందర్శించారు. పార్కులోని హిల్ వ్యూ వరకు వెళ్లి అన్నింటిని పరిశీలించి పలు సూచనలు చేయడం జరిగింది. ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్లి ట్రెక్కింగ్ చేయాల్సిన పని లేకుండా మన కళ్యాణదుర్గంలోనే ఉండటం మన అదృష్టమని, ట్రెక్కింగ్ చేసే వారి కోసం చాలా మంచిదని అన్నారు.



