Telecom Recharge | టెలికాం కంపెనీల కొత్త ప్లాన్
Telecom Recharge | టెలికాం కంపెనీల కొత్త ప్లాన్
Telecom Recharge | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారులకు మరోసారి ఆర్థిక భారం పడనుంది. టెలికాం రంగంలో ధరల పెంపు గురించి గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నట్లు తాజా విశ్లేషణలు చెబుతున్నాయి.
ధరల పెంపు ఎంత ఉండవచ్చు?
టెలికాం పరిశ్రమలోని తాజా పరిణామాలను గమనిస్తే.. రాబోయే మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో టెలికాం కంపెనీలు తమ టారిఫ్లను సుమారు 10 శాతం మేర పెంచే అవకాశం ఉందని యాక్సిస్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ మల్హోత్రా అంచనా వేశారు.
ఈసారి పెంపు భారీగా ఉంటుందా?
గతంలో జరిగినట్లుగా 15 నుంచి 20 శాతం మేర భారీ స్థాయిలో ధరల పెంపు ఉండే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి కంపెనీలు పరిమిత స్థాయిలో మాత్రమే ధరల సవరణ చేసే అవకాశం ఉందని గౌరవ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఏది ఏమైనా, రాబోయే నెలల్లో మొబైల్ వినియోగదారుల జేబులకు మరింత చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.
