Akkineni Akhil | లెనిన్ వెనుక ఏం జరుగుతోంది..?

Akkineni Akhil | లెనిన్ వెనుక ఏం జరుగుతోంది..?
Akkineni Akhil | అఖిల్‌కు లెనిన్ సినిమా ఎందుకు కీలకం?
పెద్ది రిలీజ్ ప్రకటనతో లెనిన్ సైలెంట్ ఎందుకు?
నాగార్జున – నాగవంశీ ప్రత్యేక ఫోకస్
షూటింగ్ బ్యాలెన్స్ వర్క్ కారణంగా ఆలస్యం?
సోలో రిలీజ్ డేట్ కోసం మేకర్స్ ప్లాన్
లెనిన్ రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ ఎప్పుడొస్తుంది?
Akkineni Akhil | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. ఈ మూవీని మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా (Movie) విజయం అఖిల్ కి చాలా అంటే చాలా కీలకం. అయితే.. మే 1న లెనిన్ రిలీజ్ అని ప్రకటించారు. ఆతర్వాత ఏప్రిల్ 30న పెద్ది వస్తున్నట్టుగా అనౌన్స్ చేయడంతో లెనిన్ సైలెంట్ అయ్యాడు. అయితే.. పెద్ది పోస్ట్ పోన్ అయితే.. లెనిన్ మే 1న వస్తుంది అనుకుంటే.. పెద్ది వాయిదాపడినా లెనిన్ రాదనే ప్రచారం జరుగుతుంది. అసలు.. లెనిన్ స్ట్రాటజీ ఏంటి..?
Akkineni Akhil | అందుకే.. ఆలస్యం..
మే 1న లెనిన్ రిలీజ్ అని అనౌన్స్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అయితే.. చరణ్ (Charan) పెద్ది ఏప్రిల్ 30న రిలీజ్ అని ఎప్పుడైతే అనౌన్స్ చేసారో.. అప్పటి నుంచి లెనిన్ గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా విషయంలో నాగార్జున, నాగవంశీ.. చాలా కేర్ తీసుకుంటున్నారట. పైగా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరుకు ఇది రెండో సినిమా. అందుచేత కూడా ఈ మూవీ షూటింగ్ మరింత ఆలస్యం అవుతుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

Akkineni Akhil | లేట్ అయినా లేటెస్ట్ గా..
పెద్ది మార్చి 27న రావాలి.. ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే.. ఇప్పుడు ఈ డేట్ కి కూడా రావడం అనుమానమే అని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. మే 1న తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) గాయపడ్డ సింహం రిలీజ్ అని ప్రకటించారు. దీంతో పెద్ది రిలీజ్ పై మరోసారి అనుమానులు మొదలైయ్యాయి. అయితే.. పెద్ది రాకపోతే.. లెనిన్ 1న వచ్చేందుకు రెడీ అవ్వాలి.. ఆవిధంగా అనౌన్స్ మెంట్ ఇవ్వాలి కానీ.. సైలెంట్ గానే ఉంది. దీంతో లెనిన్ వెనుక ఏం జరుగుతుంది..? అసలు ప్లాన్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. విషయం ఏంటంటే.. లెనిన్ షూటింగ్ చేయాల్సిన బ్యాలెన్స్ వర్క్ ఉందట. పైగా హడావిడిగా రిలీజ్ చేయడం కంటే.. మంచి డేట్ చూసుకుని సోలో డేట్ కే రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. అందుకనే ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదని సమాచారం. సో.. లెనిన్ రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

