TG | ఏపీ అక్రమ నీటి తరలింపు ఆపేయాలి

TG | ఏపీ అక్రమ నీటి తరలింపు ఆపేయాలి

TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ అక్రమంగా శ్రీశైలంలో విద్యుత్త ఉత్పత్తి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. గత ప్రభుత్వం శ్రీశైలంలో నీటి దోపిడీని పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను ఏపీ అలుసుగా తీసుకుందన్నారు. మా పంటలు ఎండుతుంటే.. మీరు నీళ్లు ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీళ్లు తరలించుకుపోతున్నారన్నారు. పాలమూరు హక్కులను కాపాడుకోవడమే తమ లక్ష్యమన్నారు. ఏపీ అక్రమ నీటి తరలింపు ఆపేయాలన్నారు. శ్రీశైలంలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయన్నారు.

Leave a Reply