ACB | అదనపు కలెక్టర్ నివాసాల్లో.. ఏసీబీ సోదాలు

ACB | అదనపు కలెక్టర్ నివాసాల్లో.. ఏసీబీ సోదాలు

ACB | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హన్మకొండ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకట్ రెడ్డి నివాసాల్లో ఇవాళ ఉదయం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడలోని ఆయన ఇళ్లతో పాటు బంధువుల నివాసాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సోదాల్లో డబ్బు, బంగారం, ఆస్తులకు సంబంధించిన పత్రాలను గుర్తించారు. గతనెలలో రూ.60వేల లంచం తీసుకుంటూ వెంకట్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. పాఠశాలకు అనుమతి విషయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారు. ఈ కేసులో డిప్యూటీ కలెక్టర్‌తో పాటు ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply