రాప్తాడు తహశీల్దార్కు మారికి డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి

రాప్తాడు తహశీల్దార్మా రికి డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి
రాప్తాడు, ఆంధ్రప్రభ : నియోజకవర్గ కేంద్రం రాప్తాడు మండల తహశీల్దార్ పి. విజయకుమారి డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు.
ఈ శుభ సందర్భంగా సిపిఐ పార్టీ నాయకులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండల తహశీల్దార్‌గా ఆమె అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సి. మల్లికార్జున, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామకృష్ణ, రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి ఎం. రమేష్, మండల కార్యదర్శి ఆర్. రవీంద్ర, సహాయ కార్యదర్శి చలపతి తదితరులు పాల్గొన్నారు.
