Aamir Khan | మ్యారేజ్ లైఫ్ లో మరో రీటేక్..

Aamir Khan | మ్యారేజ్ లైఫ్ లో మరో రీటేక్..

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో ప్రేమ కథలు, పెళ్లిళ్లు, విడాకులు కొత్తేమీ కాదు. కానీ పర్‌ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ మాత్రం తన వ్యక్తిగత జీవితంలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. సినిమా స్క్రిప్టుల్లోనే కాదు, రియల్ లైఫ్ మ్యారేజ్ లైఫ్‌లోనూ పర్ఫెక్షన్ వచ్చే వరకు రీ-టేక్‌లు తీసుకుంటా అంటున్నారు అమీర్ ఖాన్. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు, రెండు విడాకులు చూసిన అమీర్.. ఇప్పుడు 61 ఏళ్ల వయసులో మూడోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

1986లో కుటుంబాలకు తెలియకుండా రీనా దత్తాను ప్రేమించి వివాహం చేసుకున్న అమీర్, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యారు. అయితే 16 ఏళ్ల సంసారం తర్వాత 2002లో ఆ బంధానికి ముగింపు పలికారు. ఆ తర్వాత 2005లో దర్శకురాలు కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. “ఈసారి మాత్రం శాశ్వతమే” అనుకున్న అభిమానులకు షాక్ ఇస్తూ 2021లో ఈ జంట కూడా విడిపోయింది.

ఇప్పుడు గౌరీ స్ప్రాట్‌తో ప్రేమలో ఉన్న అమీర్ ఖాన్, జూలై 5న ఆమెను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు, సెటైర్లు పేలుస్తున్నారు. దీంతో 61 ఏళ్ల వయసులో మూడోసారి పెళ్లి చేసుకోబోతున్న అమీర్ ఖాన్ మరోసారి బాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారారు.

Leave a Reply