Karnataka | బిడ్డకు జన్మనిచ్చి.. గొంతు కోసి..

Karnataka | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కర్ణాటక రాష్ట్రంలోని దేవనహಳ್ಳಿలోని ఓ ఐఫోన్ తయారీ ప్లాంటులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్లాంట్‌లో పనిచేస్తున్న యువతి టాయిలెట్‌లో బిడ్డకు జన్మనిచ్చి, అనంతరం పసికందును హతమార్చిన సంఘటన కలకలం రేపింది.
సమాచారం ప్రకారం, 19 ఏళ్ల యువతి టాయిలెట్‌లో ప్రసవించి, ఆ తర్వాత పసికందు గొంతు కోసి సంచిలో వేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సిబ్బందిని షాక్‌కు గురిచేసింది.
ఆ యువతికి ఇంకా వివాహం కాలేదని, విషయం బయటపడితే పరువు పోతుందనే భయంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
