Ram Charan | పెద్ది గురించి వైరల్ న్యూస్..

Ram Charan | పెద్ది గురించి వైరల్ న్యూస్..
Ram Charan | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) హీరోగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న మూవీ పెద్ది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ క్రేజీ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల రిలీజ్ (Release) చేసిన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ ని షేక్ చేసింది. ఈ సాంగ్ మూవీ పై మరింతగా అంచనాలు పెంచేసింది. అయితే.. క్లైమాక్స్ గురించి ఓ న్యూస్ లీకైంది. అది వైరల్ అయ్యింది. ఇంతకీ.. ఏంటది..?
Ram Charan | యూరప్ లో చరణ్ పై సాంగ్…
ఈ మూవీ కోసం జనవరి ఎండింగ్ లో బుచ్చిబాబు, యూరప్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నాడట. యూరప్ లో చరణ్ పై సాంగ్ ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ తో పాటు ఓ యాక్షన్ సీన్ ను కూడా షూట్ చేస్తారని టాక్. అయితే.. ఈ సినిమా క్లైమాక్స్ (Climax) ఓ భారీ ప్రమాదం కారణంగా హీరో క్యారెక్టర్ కి కాళ్ళు పోతాయట. అయినప్పటికీ.. రన్నింగ్ లో హీరో ఛాంపియన్ అవుతాడని.. ఈ ఎపిసోడ్ సినిమాలో చాలా ఎమోషనల్ గా ఉంటుందనేది లీకైంది. ఇది నిజమో కాదో తెలియదు కానీ.. న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Ram Charan | ఇప్పటి వరకు చరణ్ నుంచి వచ్చిన సినిమాల కంటే..
ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా కథ ఉండడం వలనే చరణ్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. ఇందులో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత సంచలనం ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ (AR Rahaman Music) అందిస్తున్నారు. చికిరి అంటూ సాగే ఫస్ట్ సింగిల్ చాట్ బస్టర్ అవ్వడంతో సెకండ్ సింగిల్ పై మరింత క్రేజ్ ఏర్పడింది. త్వరలోనే ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మార్చి 27న పెద్ది మూవీ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. మరి.. పెద్ది మూవీతో చరణ్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.

