Revanth Reddy | సీఎంకు ఆహ్వానం

Revanth Reddy | సీఎంకు ఆహ్వానం

Revanth Reddy | బాసర, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన‌ శ్రీ జ్ఞాన సరస్వతిదేవి అమ్మవారి సన్నిధిలో ఈనెల 21 నుండి 23 వరకు నిర్వహించే వసంత పంచమి ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ఇవాళ‌ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉత్సవ ఆహ్వాన పత్రికను ఆలయ ఈవో అంజనీ దేవి ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి అందజేశారు.

అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేతుల మీదుగా వసంత పంచమి ఉత్సవ ఆహ్వాన పత్రిక, ఉత్సవాల గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ గురించి ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించగా, త్వరలో పనులు చేపడతామని హామీ ఇచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వీరి వెంట వేద పండితుడు అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply