Nizam Sarkar | దార్పు దంపతులకు 39 వర్ధంతి వేడుకలు
Nizam Sarkar | దార్పు దంపతులకు 39 వర్ధంతి వేడుకలు
- వేడుకల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, పివో, ఎస్పి, ప్రముఖులు
Nizam Sarkar | జైనూర్, ఆంధ్రప్రభ : నైజాం సర్కార్(Nizam’s Government) కాలంలో నైజాం ప్రభుత్వం గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి ప్రొఫెసర్ హైమాన్ డార్ప్ అదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి పంపించడంతో వారు వచ్చి ఏజెన్సీలో ఆదివాసులకు చేసిన సేవలు ఆదర్శనీయమని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, అసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే వక్తలు అన్నారు.
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్ల వాయిలో ఇవాళ డార్ప్ దంపతుల 39 వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వర్ధంతి వేడుకలకు వచ్చిన ప్రముఖులకు, వక్తలకు మార్లవాయి ఆదివాసీలు సాంప్రదాయ రీతిలో డోలు, భజన్త్రీలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదివాసి సంప్రదాయ రీతిలో డార్ప్ దంపతులకు సమాధుల వద్ద, విగ్రహాల వద్ద పూజలు చేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన డార్ప్ దంపతుల వర్ధంతి సభలో స్థానిక సర్పంచ్ కనక ప్రతిభ అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ఆ దంపతులు ఆదివాసి గుండెల్లో స్థిరంగా నిలిచిపోయారని అన్నారు. వారు చేసిన సేవలను మరువకుండా భావితరాలకు అందే విధంగా ఈ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఆ మహనీయుల వర్ధంతిని ప్రభుత్వం కూడా గుర్తించి అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ తన సతీమణి బెట్టి ఎలిజబెత్తో కలిసి ఆదివాసీ ప్రాంతాలకు వచ్చి, వారి జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక–ఆర్థిక స్థితిగతులపై లోతైన పరిశోధనలు చేసి, ఆదివాసుల అభ్యున్నతికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆదివాసీ సమాజం ఆయన సేవలను ఎన్నటికీ మరువదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ గోడం నగేష్(MP Godam Nagesh), ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్, కుంరం భీమ్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ఎస్పీ నికితా పంత్, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్, జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కే.విశ్వనాధ్ రావు, ఆసిఫాబాద్ ఏఎంసీ చైర్మన్ మంగ, ఆదివాసీ నాయకులు సిడం అర్జున్, మర్సుకొల తిరుపతి, మెస్రం మనోహర్, రాయ్ సెంటర్ జిల్లా మేడిలు కుర్సెంగ్ మోతిరామ్, తొడసం అమృత్ రావ్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఆత్రం భుజంగ్ రావ్, డిడి రమాదేవి, ఐటీడీఏ ఈ ఈ తానాజీ, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి తాసిల్దార్ ఆడ బీర్షావ్, ఎంపీఓ శశికుమార్, సిఐ రమేష్, ఎస్ఐ రవికుమార్, వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘం నాయకులు, నూతన సర్పంచులు, ఆదివాసి నాయకులు ఆదివాసీలు పాల్గొన్నారు.
