Srikakulam | ప్రధాన రహదారి కాల్వ పనుల పరిశీలన

Srikakulam | ప్రధాన రహదారి కాల్వ పనుల పరిశీలన
Srikakulam | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం మండలం రాగోలు పంచాయతీ ప్రధాన రహదారిలో జరుగుతున్న కాలువ పనులు ఎమ్మెల్యే శంకర్ ఇవాళ స్వయంగా పరిశీలించారు. భవిష్యత్తులో రాగోలు పంచాయితీ మురుగునీరు ప్రవహించేందుకు ప్రధాన కాలువ సక్రమంగా నిర్మించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాలువ లైన్ అలైన్ మెంట్ చూసుకొని సక్రమంగా కాలువ నిర్మాణ పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రాగోలు గ్రామపంచాయతీ తెదేపా సీనియర్ నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
