Medchal | స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఏకైక పత్రిక ఆంధ్రప్రభ

Medchal | స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఏకైక పత్రిక ఆంధ్రప్రభ

  • మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి.

Medchal |మేడ్చల్, ఆంధ్రప్రభ : స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక పత్రిక ఆంధ్రప్రభ అని మేడ్చల్ శాసనసభ్యులు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే ఇంటి ఆవరణలో ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ఆవిష్కరించిన అనంతరం ఆంధ్రప్రభ సేవలు, నిజమైన వార్తలు, నిజాలను నిర్భయంగా వెలికి తీసే పత్రిక అని ఆయన కొనియాడారు. ఆంధ్రప్రభ నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ను ఆంధ్రప్రభ నియోజకవర్గ విలేకరులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జోనల్ మేనేజర్ మహేందర్ రెడ్డి, , జవహర్ నగర్ గౌరి శంకర్, శామీర్ పేట్ గిరిప్రసాద్, మూడు చింతలపల్లి కార్తిక్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, అప్పమ్మ గారి జగన్ రెడ్డి, జవహర్ నగర్ కాంగ్రెస్ నాయకులు మేకల భార్గవ్ రామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply