Ministers | దమ్మపేటలో ఆంధ్రప్రభ క్యాలెండర్ ఆవిష్కరణ

Ministers | దమ్మపేటలో ఆంధ్రప్రభ క్యాలెండర్ ఆవిష్కరణ

Ministers | దమ్మపేట, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఇవాళ‌ ఆంధ్రప్రభ క్యాలెండర్‌ను మంత్రులు (Ministers) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల, సి ఏ డి, ఆహార, పౌర సంబంధాల శాఖల మంత్రి నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అశ్వారావుపేట, సత్తుపల్లి ఎమ్మెల్యేలు జారే ఆది నారాయణ, మట్టా రాగమయి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ (Collector) జితేష్ వి పాటిల్ లతో దమ్మపేట ఆంధ్రప్రభ రిపోర్టర్ ఈశ్వర్, త‌దిత‌రులు పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు క్యాలెండర్‌ను ఆవిష్కరించి, ఆంధ్రప్రభ పత్రిక సేవలను, సమాచార విస్తరణలో ఉన్న పాత్రను కొనియాడారు.

CLICK HERE TO READ ఏసీబీ సోదాలు

CLICK HERE TO READ MORE

Leave a Reply