మోత్కూర్ లో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు
బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు
మోత్కూర్, ఆంద్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను శనివారం స్థానిక మహాత్మా జ్యోతి రావ్ పూలే చౌరస్తా వద్ద బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల సమావేశంలో బర్త్ డే కేక్ ను ఆ పార్టీ మండల ,పట్టణ అధ్యక్షులు పొన్నెబొయిన రమేష్, జంగ శ్రీను లు కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో పయనించి ,స్వరాష్ట్ర సాధనకు అహర్నిశలు కృషి చేసి,బంగారు తెలంగాణ సాధనలో బాగస్వాములైన జగదీశ్వర్ రెడ్డి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొనతం యాకుబ్ రెడ్డి,రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు కొండ సోంమల్లు,మాజీ సర్పంచ్ లు బయ్యని పిచ్చయ్య, బత్తిని తిరుమలేష్,సీనియర్ నాయకులు మర్రి అనిల్,గజ్జి మల్లేష్, ఎస్సి,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులు దాసరి తిరుమలేష్,సింగిల్ విండో డైరెక్టర్లు సామ పద్మారెడ్డి,పురుగుల మల్లయ్య,నాయకులు కోక బిక్షం,గంగుల రాములు, కూరేళ్ల పరమేష్,మలిపెద్ది మల్లారెడ్డి,మొరిగాల వెంకన్న,శ్రీను,బందెల శ్రీను,ఇంద్రశేఖర్, రమేష్,అన్నం దాసు విద్యాసాగర్,మచ్చగిరి,కల్వల శోభన్ బాబు,ఎడ్ల పాండు,బుర్ర వెంకన్న,తాటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
