MLA | కొండపల్లి ప్రజదర్బార్‌లో 241 అర్జీలు

MLA | కొండపల్లి ప్రజదర్బార్‌లో 241 అర్జీలు

  • స్వీక‌రించిన‌ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

MLA | ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం : కొండపల్లి మున్సిపాలిటీ ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఈ రోజు ప్రజదర్బారు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. మొత్తం 241 మంది అర్జీలు సమర్పించారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply