invitation letter | దత్తాత్రేయ ఆశ్రమ పీఠాధిపతికి ఆహ్వానం

invitation letter | వికారాబాద్, ఆంధ్రప్రభ : ఈనెల 25 నుండి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని చిగుళ్లపల్లి గ్రామంలో నిర్వహించనున్న అతిరుద్ర మహాయాగానికి రావాల్సిందిగా వికారాబాద్ జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు శీలము గారి ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి శ్రీలత రెడ్డి దత్తాత్రేయ ఆశ్రమం పీఠాధిపతి దత్త గిరి స్వామికి ఆహ్వానపత్రం అందజేశారు. భారీ ఎత్తున నిర్వహించే ఈ అతిరుద్ర మహాశయానికి పలికేందుకు వారు స్వామీజీని కోరారు. ఈ విషయంలో ఆలోచించి నిర్ణయిస్తానని స్వామీజీ పేర్కొన్నట్టు వారు స్పష్టం చేశారు.
