Godadevi | జన్మ నక్షత్ర వేడుకలు..

Godadevi | జన్మ నక్షత్ర వేడుకలు..
Godadevi, విజయవాడ, ఆంధ్రప్రభ : విశిష్టమైన శ్రీగోదాదేవి అమ్మవారి జన్మ నక్షత్రం పూర్వఫల్గుణి నక్షత్రం సందర్భంగా గురువారం నగర పరిధిలోని తాడిగడప గ్రామంలోని ఎస్‌టిబిఎల్ కాలనీలో ఉన్న శ్రీనివాస క్షేత్రంలో భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పుట్టింటి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారిని సాంప్రదాయ రీతిలో విశేషంగా అలంకరించి, వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పుట్టింటి సారె సమర్పణ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, కాలనీ వాసులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు అందరికీ కలగాలని ప్రార్థించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ జరగగా, ఈ వేడుకలతో ఎస్‌టిబిఎల్ కాలనీ పరిసరాలు భక్తి పరిమళాలతో నిండిపోయాయి.

