CMRF | ముఖ్యమంత్రి సహాయ నిధిని అందజేత‌…

CMRF | ముఖ్యమంత్రి సహాయ నిధిని అందజేత‌…

  • అనేక కుటుంబాలకు ఊరట..
  • సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.

CMRF | పాయకాపురం, ప్రభన్యూస్ : ముఖ్యమంత్రి సహాయ నిధిని(Chief Minister’s Relief Fund) ప్రజలకు అందించడం ద్వారా అనేక కుటుంబాలకు ఊరటనిస్తుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అజిత్ సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో 60వ, 59వ డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు సుమారు తొమ్మిది లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఈ రోజు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేద వర్గాల ప్రజలకు నిజంగా ఒక వరంలా మారిందని తెలిపారు.పేదలకు వరంలా ముఖ్యమంత్రి సహాయ నిధి మారిందని అన్నారు. రోజువారీగా ఈ సహాయం ప్రజలకు అందడం వల్ల అనేక కుటుంబాలకు ఊరట లభిస్తోందని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం(Government) అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలను ఆదుకోవడం నిరంతరంగా కొనసాగుతోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, డివిజన్ ప్రెసిడెంట్లు రాజానా బంగారు నాయుడు, బేవర సూరి, ప్రధాన కార్యదర్శి బుదాల సురేష్, కంచేటి నాగరాజు, డివిజన్ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply