SUICIDE | నిన్న ప్రియురాలు.. నేడు ప్రియుడు..

SUICIDE | నిన్న ప్రియురాలు.. నేడు ప్రియుడు..
- బలవన్మరణం!
SUICIDE | యాచారం, ఆంధ్రప్రభ : వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామనుకున్నారు.. ప్రియురాలి తల్లి అడ్డుపడింది! కూతురుకు కౌన్సెలింగ్ ఇచ్చింది! చిన్నప్పటి నుంచి కూలీ చేసి చదివించిన అమ్మ మాటను జవదాట లేదు.. కూతురు ప్రవర్తనలో మార్పు వచ్చింది. సోమవారం రాత్రి ప్రియురాలికి ఫోన్ కాల్ వచ్చింది. తాను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రియుడు హెచ్చరించాడు. నిన్న ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. ప్రియురాలి ఆత్మహత్యను భరించలేని ప్రియుడు కూడా ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. వారిద్దరి ప్రేమ కథే కాదు.. జీవితాలు కూడా ముగిశాయి!
SUICIDE | వారిద్దరి లవ్ జర్నీ!
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో పోతురాజు పూజ (17) ఆత్మహత్య చేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం(Inter second year) చదువుతోంది. ఆమె తండ్రి 16 ఏండ్ల క్రితమే చనిపోగా.. తల్లి కూలీ పనులు చేస్తూ పోషిస్తోంది. నాలుగు నెలలుగా అదే గ్రామానికి చెందిన సిద్ధగోని మహేష్ (20) అనే యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్లు- కుటు-ంబ సభ్యులకు తెలిసింది. విషయం తెలుసుకున్న తల్లి కుమార్తెకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో.. ఆ తర్వాత ప్రవర్తనలో మార్పు(A change in behavior) కనిపించింది.
వీరిద్దరు కొన్ని రోజులుగా కలుసుకోవడవం లేదు. ఈ క్రమంలో సోమవారం మహేష్ ఫోన్ ద్వారా యువతితో మాట్లాడుతూ.. తనను పెళ్లి చేసుకోవాలని, లేకుంటే చనిపోతానని బెదిరించినట్లు తల్లితో చెప్పింది. ఆ రాత్రి నుంచి మనస్తాపానికి గురైనట్టు కుటుబసభ్యులు గమనించారు. నిన్న ఉదయం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తల్లి, ఇతరుల సహాయంతో ఇబ్రహీంపట్నంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
SUICIDE | ప్రియురాలి లేదని..
వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు(Love). జీవితాంతం కలిసి జీవించాలని కలలు కన్నారు. ఉరేసుకొని నిన్న ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి లేదని ప్రియుడు సిద్ధగోని మహేశ్ (20) పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతంలో పెళ్లికి అభ్యంతరం చెప్పారని మహేశ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొన్ని రోజులు దవాఖానాలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు.
మహేష్ పురుగుల మందు తాగిన విషయాన్ని తెలుసుకున్న పూజ సైతం మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. ఆమె సైతం ప్రాణాలతో బయటపడింది. పూజ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న అన్న విషయాన్ని తెలుసుకున్న మహేష్ బుధవారం హయత్ నగర్ పరిధిలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అటు పూజ ఇటు మహేష్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో మేడిపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇరు కుటుంబాలలో రోదనలు మిన్నంటాయి.
