ANDHRA PRABHA | క్యాలెండర్ ఆవిష్కరణ

ANDHRA PRABHA | నార్సింగి, ఆంధ్రప్రభ : నార్సింగి పట్టణంలోని కె. నారాయణ మెమోరియల్ కళాశాలలో ఆంధ్రప్రభ నూతన సంవత్సర క్యాలెండర్ను కళాశాల ప్రిన్సిపాల్ కేశవ నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రభ దినపత్రిక ఎన్నో దశాబ్దాలుగా నిష్పక్షపాతమైన వార్తలతో ప్రజల విశ్వాసాన్ని సంపాదించిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, సమాజంలో చైతన్యం, అవగాహన పెంచడంలో పత్రికల సేవ అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణను విజయవంతం చేశారు.
