Task Force | జుక్కల్లో జోరుగా పేకాట..

Task Force | జుక్కల్లో జోరుగా పేకాట..
- రెండు పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
- 8ఎనిమిది మంది పేకాటరాయుల అరెస్ట్
- 13,545 రూపాయల నగదు,9మొబైల్ ఫోన్లు,4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
Task Force | జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో రోజు రోజుకు పేకాట జోరందుకుంటుది. పక్క సమాచారం మేరకు రాత్రి కామారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్(Task Force) ఎస్ఐ ఉస్మాన్ ఆధ్వర్యంలో పోలీసుఅధికారులు జుక్కల్ మండలంలోని రెండు పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. జుక్కల్ లోని మాజీ ప్రజా ప్రతినిధి పంట పొలంలో గల రేకుల షెడ్డులో పేకట ఆడుతున్న 5గురు పేకాటరాయులను అరెస్ట్ చేయటమే కాకుండా వారి వద్ద నుండి9, 965 నగదు, 5 మొబైల్ ఫోన్లు(Mobile Phones), రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవటం జరిగింది.
దింతో పాటు ఒక నాయకుని పాత జిన్నింగ్ మిల్లులో పేకాట స్థావరంపైదాడి నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయడం కాకుండా, వారి వద్ద నుండి 3,580 నగదు నాలుగు మొబైల్ ఫోన్లో, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వారిని జుక్కల్ పోలీస్ స్టేషన్ కు అప్పగించటం జరిగింది. జుక్కల్ ప్రాంతంలో రోజురోజుకు పేకాట జూదం పెరగటంతో మండలం వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
