Government | బీటీ, సీసీ రోడ్లు మంజూరు చేయాలని ఎంపీకి వినతి

Government | బీటీ, సీసీ రోడ్లు మంజూరు చేయాలని ఎంపీకి వినతి

Government | జైనూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత మండలాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు(Government funding) ఏక్కువ మొత్తంలో కేటాయించాలని ఏజెన్సీ మండలాలకు ఆధిక ప్రాధాన్యత కల్పించాలని, ఏజెన్సీ మండలాలలోని పలు గ్రామాలలో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, వివిధ మౌళిక వసతులకోసం నిధులు తప్పక కేటాయించాలని, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఆదివాసి సంఘాల ఐకాస రాష్ట్ర వర్కింగ్ ప్రసిడేంట్ కనక యాధవరావు ఇవాళ జైనూర్ మండల సర్పంచ్ల సంఘం మాజీ మండల అధ్యక్షుడు మాడావి భీంరావుతో కలిసి ఆదిలాబాదు పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్(Godam Nagesh) నివాసంలో ఆయనను మార్యద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి విన్నవించినట్లు వారు పేర్కొన్నారు.

వెనుకబడిన ఏజెన్సీ మండలాలకు కేంద్ర ప్రభుత్వ ఏంపి, నిధులను కేటాయించి గ్రామాల అభివృద్దికి, కృషిచేయాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ నగేష్ సానుకులంగా స్పందించి, తప్పక ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తానని హమీ ఇచ్చారని వారు తెలిపారు. ఎంపీకి కలిసిన వారిలో వారితో యువ నాయకులు కేంద్రే విశాల్ పాల్గొన్నారు.

Leave a Reply