Ghantasala | కోడి పందేలు చట్టరీత్యా నేరం..!

Ghantasala | కోడి పందేలు చట్టరీత్యా నేరం..!
Ghantasala | ఘంటసాల, ఆంధ్రప్రభ : కోడిపందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై ఎంతటి వారైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ బి.విజయ ప్రసాద్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మండలంలో కోడిపందేలు నిర్వహించకుండా తీసుకోవాల్సిన చర్యలపై తహసీల్దార్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కోడి పందేల నిషేధంపై చర్చించారు. గ్రామాల వారీగా తనిఖీ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఘంటసాల ఎండీఓ సుబ్బారావు, ఎస్సై ప్రతాప్ రెడ్డి, జూనియర్ వెట్నరరీ ఆఫీసర్ మాధురి, సచివాలయాల డిప్యూటీ ఎంపీడీఓ శివరామ ప్రసాద్ పాల్గొన్నారు.
