Aadi Saikumar | ఆ ఐదు సినిమాల్లో శంబాల గ్రేట్..

Aadi Saikumar | ఆ ఐదు సినిమాల్లో శంబాల గ్రేట్..

Aadi Saikumar | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది శంబాల సినిమా. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడమే గాక నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టి క్రిస్మస్ విన్నర్ గా నిలిచింది. ముఖ్యంగా ఆదికి మాత్రం శంబాల సినిమా మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అర్చన ఐయ్యర్ హీరోయిన్ గా నటించింది. శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యగంధర్ ముని తెరకెక్కించిన తీరు, కొత్త పాయింట్‌ను టచ్ చేయడం, అన్ని రకాల అంశాల్ని జోడించి తెరకెక్కించడం కలిసి వచ్చిన అంశం. ఈ నేపథ్యంలో శంబాల థాంక్స్ మీట్ (Shambala Thanks Meet) నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరై, చిత్రయూనిట్ మొత్తాన్ని అభినందించారు.

Aadi Saikumar

Aadi Saikumar | బొమ్మరిల్లు 2 తీయాలంటే..

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమా దర్శకులు యుగంధర్ కి, ఇద్దరు నిర్మాతలు రాజశేఖర్, మహిధర్ రెడ్డికి అదే విధంగా ఆది సాయి కుమార్, అర్చన సహా చిత్రయూనిట్ మొత్తానికి కంగ్రాట్స్. క్రిస్మస్ కి విడుదలైన 5 సినిమాల్లో శంబాల సక్సెస్ గా నిలబడటం గ్రేట్. లాస్ట్ మంత్ నేను విదేశాల్లో ఉన్నా. విడుదలైన అన్ని సినిమాల ఫాలో అప్ చేస్తుంటే శంబాల 100 పర్సెంట్ సక్సెస్ అని విన్నా. ఈ సినిమాకు పబ్లిక్ లో మంచి టాక్ రావడం, విజయవంతంగా నిలబడటం చాలా సంతోషకర విషయం. ఈ సినిమా ఆదికి 25వ సినిమా. ఈ 25వ సినిమా విజయవంతం కావడం రియల్లీ హ్యాపీ. ఒకప్పుడు బొమ్మరిల్లు (Bommarillu) సినిమా సినీ ఇండస్ట్రీలో చాలా చేంజ్ తీసుకొచ్చింది. నిజంగా బొమ్మరిల్లు 2 తీయాలంటే మాత్రం ఆది, వాళ్ళ నాన్న సాయి కుమార్ లతో తీయాలి. కొడుకు సక్సెస్ కోసం తండ్రి పడే తపన మాటల్లో చెప్పలేం. అలా సాయి కుమార్ గారు తన కొడుకుతో పాటు శంబాల టీమ్ మొత్తానికి బ్యాక్ బోన్ గా నిలిచి సినిమా విజయంలో భాగమయ్యారు. సాయి కుమార్ ఇండస్ట్రీలోని అందరితో చాలా బాగుంటారు. ఇది టాలీవుడ్ లో ఆయన ఒక్కడికే చెల్లింది. ఈ సినిమా ప్రోమో చూసినప్పుడే చెప్పా ఇది సక్సెస్ అవుతుందని. ఇప్పుడు అదే జరిగింది. ఈ రోజుల్లో ఒక సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేయడం, సక్సెస్ కావడం మామూలు విషయం కాదు. శంబాల అది చేసి చూపించింది. అందరికీ మరోసారి కంగ్రాట్స్” అన్నారు.

Aadi Saikumar

Aadi Saikumar | పట్టలేని ఆనందం..

ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. ”ఈ రోజు మా సినిమా థాంక్స్ మీట్ కి దిల్ రాజు (Dilraju) గారు రావడం చాలా హ్యాపీగా ఉంది. టీం మొత్తం చాలా సంతోషంగా ఉన్నారు. ఎంతో పోటీ నడుమ విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ రన్ అవుతూ ఉండటం పట్ల పట్టలేని ఆనందంతో ఉన్నాం. ఈ సినిమాను మౌత్ టాక్ తో ముందుకు తీసుకెళ్తున్న ఆడియన్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇకపై కెరీర్ బాగా ప్లాన్ చేసుకొని ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాను. ఈ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలన్నింటికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.

Aadi Saikumar

Aadi Saikumar | మాంచి కిక్కిచ్చింది..

సాయి కుమార్ మాట్లాడుతూ.. దిల్ రాజు గారు అందరి గురించి ఆలోచిస్తారు. సపోర్ట్ చేస్తారు. ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటారు. పోలీస్ స్టోరీ నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. ఆ రోజు పోలీస్ స్టోరీకి నాకు మెమెంటో రావడం ఇప్పటికీ మర్చిపోలేను. ఈ రోజు మా శంబాల చిత్ర యూనిట్ అందరికీ దిల్ రాజు గారు మెమెంటో అందిస్తున్నారు. ఆయనకు అందరి తరఫున స్పెషల్ థ్యాంక్స్. శంబాల (Shambala) మంచి కిక్కిచ్చింది. అన్ని సినిమాలు బాగుండాలి అందులో మన సినిమా బాగుండాలి అని కోరుకునే మనిషిని. ఈ సినిమాను టాలీవుడ్ అంతా సెలబ్రేట్ చేసుకుంటోంది. మంచి కంటెంట్ ఎప్పుడూ గెలుస్తుంది అని శంబాల నిరూపించింది. దేశ విదేశాల నుంచి ఎందరో మిత్రులు ఫోన్ చేసి అభినందనలు చెబుతున్నారు. ఈ సక్సెస్ ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లందరికీ పేరు పేరునా థ్యాంక్స్. జనవరి 9న హిందీలో రిలీజ్ అవుతోంది. అక్కడ కూడా సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను అన్నారు.

Aadi Saikumar

CLICK HERE TO READ ఒకే రోజు 3 ఈవెంట్లు..

CLICK HERE TO READ MORE

Leave a Reply