Telangana | వ‌చ్చే నెల మూడో తేదిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ?

హైద‌రాబాద్ – తెలంగాణ‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన నేప‌ధ్యంలో కొత్త‌గా . న‌లుగురు కొత్త మంత్రుల‌కు రేవంత్ రెడ్డి త‌న మంత్రి వ‌ర్గంలో అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు.. ఇక ఈ కొత్త మంత్రులు ఏప్రిల్ 3న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం .. ఇది ఇలా ఉంటే ఇక న‌లుగురు మంత్రుల్లో ఇద్ద‌రు బీసీలు, రెడ్డి, ఎస్సీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారికి మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్క‌వ‌చ్చ‌ని అంటున్నారు..

రెడ్డి సామాజిక వ‌ర్గంలో రాజ‌గోపాల్ రెడ్డి, సుద‌ర్శ‌న్ రెడ్డి, మ‌ల్‌రెడ్డి రంగారెడ్డిలో ఒక‌రికి మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కే అవ‌కాశం ఉంది. ఎస్సీలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంక‌ట‌స్వామికి… బీసీ సామాజిక వ‌ర్గంలో ఆది శ్రీనివాస్, శ్రీహ‌రి ముదిరాజ్‌ల‌కు చోటు ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఒక వేళ మ‌రో స్థానం భ‌ర్తీ చేయాల‌నుకుంటే మైనారిటీ వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌కు చోటు ద‌క్కే అవ‌కాశం ఉంది.. అప్పుడు ఆది శ్రీనివాస్, వాకిటి శ్రీహ‌రిలో ఒక‌రికే అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చు.. భ‌విష్య‌త్ లో మ‌రో ఇద్ద‌రితో మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *