Jainoor | జీవితంపై విరక్తితో హమాలీ ఆత్మహత్య

Jainoor | జీవితంపై విరక్తితో హమాలీ ఆత్మహత్య

Jainoor | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని గణేష్ నగర్ (ఎస్సీ కాలనీ) చెందిన హమాలీ పుల్లారే శంకర్ (50) ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా విరక్తి చెంది మద్యం సేవించి మద్యం మత్తులో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు మాంగ్ సమాజ్ సంఘం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు మాహాలే దత్త మాంగ్ జిల్లా నాయకులు పుల్లారే విజయ్ కుమార్ తెలిపారు.

హ‌మాలీ పనిచేస్తూ జీవనం గడిపేవాడని, ఆర్థిక ఇబ్బందుల సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడని వారు తెలిపారు. ఆయన కుటుంబీకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని వారు తెలిపారు. మృతునికి ముగ్గురు కొడుకులు, కూతురు పిల్లలు ఉన్నారని తెలిపారు.

Leave a Reply