kalyani priyadarshan | కళ్యాణి ప్రియదర్శన్ కి.. అక్కడ కలిసొచ్చేనా..?

kalyani priyadarshan | కళ్యాణి ప్రియదర్శన్ కి.. అక్కడ కలిసొచ్చేనా..?
kalyani priyadarshan | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మలయాళ ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్.. తెలుగులో అఖిల్ మూవీ హాలోతో కెరీర్ స్టార్ట్ చేసింది. తొలి సినిమాతో మెప్పించింది కానీ.. టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. ఇటీవల మలయాళంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ (Blockbuster success) సాధించింది. దీంతో ఈ అమ్మడుకు ఇప్పుడు బంపర్ ఆఫర్ వచ్చింది. ఇంతకీ.. కళ్యాణికి వచ్చిన బంపర్ ఆఫర్ ఏంటి..? ఈ కేరళ కుట్టి.. ఆశ నెరవేరేనా..?

kalyani priyadarshan | కళ్యాణి సెన్సేషన్ లోకా..
అక్కినేని అఖిల్ హలో సినిమా తర్వాత తెలుగులో చిత్రలహరి, రణరంగం చిత్రాల్లో నటించింది. ఆతర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. తమిళ్, మలయాళంలో వరుసగా సినిమాలు (Movies) చేస్తుంది. ఇటీవల ఫీమెల్ సెంట్రిక్ యాక్షన్ డ్రామా లోకా – చాప్టర్ 1 అనే సినిమాలో నటించింది. మలయాళంలో రూపొందిన ఈ సినిమాలో కళ్యాణి వేరే లెవల్లో నటించింది. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించింది. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా సుమారు 300 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది మలయాళ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా, కళ్యాణి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో కళ్యాణి పేరు మారుమ్రోగడంతో భారీ ఆఫర్స్ వస్తున్నాయి.

kalyani priyadarshan | రణ్ వీర్ సింగ్ కు జంటగా కళ్యాణి..
ఇప్పుడు ఈ అమ్మడుకు బంపర్ ఆఫర్ వచ్చింది. ఇంతకీ.. ఏంటా బంపర్ ఆఫర్ అంటే.. బాలీవుడ్ లో (Bollywood) సినిమా ఛాన్స్ వచ్చింది. అది కూడా దురంధర్ అనే సినిమాతో 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించిన రణ్ వీర్ సింగ్ కు జంటగా నటించే ఛాన్స్. ఈ ధురంధర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నారు. ఈ మూవీ టైటిల్ ప్రశయ్. ఇందులో రణ్ వీర్ సింగ్ కు జంటగా కళ్యాణి ప్రియదర్శన్ ని తీసుకున్నారనే వార్త వైరల్ అయ్యింది. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో కళ్యాణి పేరు బాగా సౌండ్ చేస్తుంది. ఈ బాలీవుడ్ ఆఫర్ తో.. ఆమె కెరీర్ మరో స్థాయికి వెళ్లడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఎప్పటి నుంచో ఈ అమ్మడు బాలీవుడ్ లో అడుగు పెట్టాలి అనుకుంటుంది. ఇప్పుడు ఆ లక్కీ ఛాన్స్ వచ్చింది. మరి.. మాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన కళ్యాణి.. బాలీవుడ్ లో కూడా సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి.


