Craze Heroine | శర్వాకు టర్నింగ్ పాయింట్ కానుందా..?

Craze Heroine | శర్వాకు టర్నింగ్ పాయింట్ కానుందా..?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : శర్వానంద్.. వైవిధ్యమైన చిత్రాలతో అలరింంచే యంగ్ హీరో. ఒకప్పుడు వరుసగా సక్సెస్ ఫుల్ మూవీస్(Successful movies) లో నటించాడు. ఈమద్య కాలంలో సరైన సక్సెస్ లేక కెరీర్ లో వెనకబడ్డాడు. గత కొంతకాలంగా సక్సెస్ సాధించాలని ప్రయత్నిస్తున్నాడు కానీ.. రావడం లేదు. సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్(Family entertainer) తో వస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఓ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడు. ఆ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్ నటించనున్నట్టు టాక్. ఇంతకీ.. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు..? ఆ హీరోయిన్ ఎవరు..?
Craze Heroine | డిఫరెంట్ స్టోరీ రెడీ చేసిన వైట్ల..

శర్వానంద్ తో సినిమా ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల(Star director Srinu Vaitla). ఈ స్టార్ డైరెక్టర్ ఒకప్పుడు వరుసగా సక్సెస్ అందించాడు. అయితే.. టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. ఈమధ్య కాలంలో వరుసగా ప్లాప్స్ చూశాడు. ఇటీవల విశ్వం అనే సినిమా తెరకెక్కించారు. గోపీచంద్ తో తీసిన విశ్వం యావరేజ్ గా నిలిచింది. ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ సాధించాలని శ్రీను వైట్ల కథ పై బాగా కసరత్తు చేసి ఓ విభిన్న కథను రెడీ(Ready the story) చేశాడట. ఈ కథకి శర్వానంద్ ఓకే చెప్పడంతో త్వరలో ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించనుందని సమాచారం.
Craze Heroine | శర్వాకు జంటగా రుక్మిణి వసంతన్..

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో కథానాయికగా రుక్మిణి వసంతన్(Rukmini Vasanthan) ను ఫైనల్ చేసారని ప్రచారం జరుగుతుంది. ఈ అమ్ముడు ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమాలో నటిస్తుంది. కాంతార 1 సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసింది ఈ బ్యూటీ. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్(Regular shooting of the movie starts) కానుందని తెలిసింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్ లో జరిగే డ్రామా చాలా బాగుంటుందట. ఈమూవీలో మరో సీనియర్ హీరో(Senior hero) కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. శర్వా.. కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గురించి చూస్తున్నాడు. మరి.. ఈ మూవీ టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందేమో చూడాలి.

