transfer | నియామ‌కం..

transfer | నియామ‌కం..

  • అహోబిలం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌గా శ్రీనివాసరెడ్డి

transfer | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా పరిధిలోని అటవీ శాఖలో పలు మార్పులు చేపట్టారు. ఇందులో భాగంగా అధికారులకు పదోన్నతులు బదిలీలు చేశారు. రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని అహోబిలం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌గా శ్రీనివాసరెడ్డిని ఉన్నతాధికారులు నియమించారు. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ముర్తు జావలి పదోన్నతి పై రుద్రవరం రేంజ్ ఆఫీసర్‌గా బదిలీ అయ్యారు.

ఆయన స్థానంలో ఆలమూరు సెక్షన్ ఆఫీసర్ మత్తర్ భాష ఇన్చార్జి డిప్యూటీ రేంజర్ గా ఉంటున్నారు. ఫారెస్ట్ ఉన్నతాధికారులు నూతన సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరెడ్డికి పదోన్నతి కల్పించి అహోబిలం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ రోజు శ్రీనివాసరెడ్డి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అటవీ శాఖ సంరక్షణ కు పూర్తిగా కృషి చేస్తానని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Leave a Reply